నెల్లూరులోని ‘సంగం’ బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు – అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Announces in Assembly Sangam Barrage is Named After Gautam Reddy, CM YS Jagan Announces in Assembly Sangam Barrage is Named After Gautam Reddy, Sangam Barrage is Named After Gautam Reddy, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, AP CM YS Jagan Mohan Reddy Chief Minister of Andhra Pradesh, Sangam Barrage, Gautam Reddy, Mekapati Goutham Reddy, Former Minister of Industries of Andhra Pradesh, Mekapati Goutham Reddy Former Minister of Industries of Andhra Pradesh, YS Jagan, Jagan, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, AP assembly budget session, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ బ్యారేజీకి సంబంధించిన పనులు ఇప్పటికే 84 శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలిన వర్కుని మరో ఆరు వారాల్లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కూడా తన ప్రసంగాన్ని వినిపించారు.

గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్‌ త్వరలోనే పూర్తి చేస్తామని, దాని ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 14 =