హిందూపురం టార్గెట్‌గా వైసీపీ కొత్త వ్యూహం..

Minister Peddireddy Ramachandra Reddy Directs YCP Cadre For The Victory at Hindupur in Next Elections,Minister Peddireddy Ramachandra Reddy,YCP Cadre For The Victory at Hindupur,Hindupur in Next Elections,Mango News,Mango News Telugu,Peddireddy, Balayya Adda,YCP, YCPs new strategy, Hindupuram,Balakrishna,Minister Peddireddy Latest News,Minister Peddireddy Latest Updates,Hindupur in Next Elections News,Hindupur Live Updates

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్‌ను ప్రవేశ పెట్టారు.

దీంతో వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ విషయంలోనై రాజీపడట్లేదు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. దీని కోసం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానంగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దీని ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగైదు సార్లు ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.

వైనాట్ టాస్క్‌ను కంప్లీట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లోనూ పాగా వేయాల్సి ఉంటుంది. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాలు అవి. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోని నియోజకవర్గాలు ఈ రెండూ కూడా. బలమైన ఈ రెండు నియోజకవర్గాల్లో జెండా ఎగరేయాలనేది వైసీపీ వ్యూహం.

ఇందులో భాగంగా.. వైసీపీ రాయలసీమ జిల్లా కోఆర్డినేటర్, విద్యుత్- అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా హిందూపురంలో పర్యటించారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు చోట్లా టీడీపీకి ఓటమి తప్పదని అన్నారు. దొంగ ఓట్లను అడ్డుగా పెట్టుకుని టీడీపీ గెలుస్తూ వస్తోందనేది బహిరంగ రహస్యమని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =