డిసెంబరు నుంచి సచివాలయాల సందర్శనకు వస్తా : సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Decided To Visit Secretariats, AP CM YS Jagan Decided To Visit Secretariats From December Month, Highlights Of Spandana Video Conference Chaired By AP CM, Highlights Of Spandana Video Conference Chaired By AP CM YS Jagan Mohan Reddy, Jagan to tour all districts, Jagan to tour all districts from December, Mango News, MLAs told to visit secretariats from Oct, Spandana Video Conference, video conference reviewing the Spandana programmes, YS Jagan Mohan Reddy to roll out citizen outreach drive

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం స్పందన సమీక్షలో భాగంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు నుంచి రాష్ట్రంలోని సచివాలయాల సందర్శనకు వస్తానని చెప్పారు. వచ్చే నెలనుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని సూచించారు. డిసెంబర్‌ నెల నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తానని,
ప్రతి పర్యటనలో కూడా సచివాలయాల పని తీరును పరిశీలిస్తానని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చామన్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించమని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

ఇకపై ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలని, సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌రీజ్‌ కార్యక్రమం ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్‌ నంబర్లతో కూడిన పాంప్లెట్లను వారికి అందించాలని, ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. మరోవైపు హౌసింగ్‌, ఒన్‌టైం సెటిల్‌మెంట్‌–జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌, ఉపాధి హామీ, వైఎస్ఆర్ డిజిటల్‌ లైబ్రరీలు, కోవిడ్-19, సీజనల్‌ వ్యాధులు, కోవిడ్-19 ధర్డ్‌ వేవ్‌ సన్నద్ధత, కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రైవేటు ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు, అక్టోబరులో చేపట్టే సంక్షేమ పథకాలపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 16 =