క్రిస్మస్‌ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు.

2021 Christmas celebrations, Andhra Pradesh, Andhra Pradesh Governor, AP Christmas Celebrations, AP CM YS Jagan extends Christmas greetings, AP CM YS Jagan Greets People, AP CM YS Jagan Greets People of the State on Christmas, AP CM YS Jagan Message for Christmas 2021, christmas, Christmas 2021, Christmas Celebrations, Christmas celebrations 2021, Christmas Celebrations In AP, Christmas Greetings, CM YS Jagan Greets People of the State on Christmas, Mango News

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు.

దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం, ఇవీ జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − four =