రైతులకు ఉచితంగా బోర్లు, సెప్టెంబర్ 28 న “వైఎస్ఆర్ జలకళ” పథకం ప్రారంభం

AP CM YS Jagan, AP CM YS Jagan Will Launch YSR Jalakala Scheme, AP YSR Jalakala Scheme, Jalakala Scheme In AP, YSR Jalakala, YSR jalakala Free Borewell Scheme, YSR Jalakala Scheme, YSR Jalakala Scheme In AP, YSR Jalakala Scheme News, YSR Jalakala Scheme Today Latest News, YSR Jalakala Scheme Updates

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు ఉచిత బోర్లు తవ్వించే “వైఎస్ఆర్ జలకళ” పథకాన్ని సెప్టెంబర్ 28 న లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో మొత్తం 1.98 లక్షల పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతుంది.

ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజక వర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను సెప్టెంబర్ 28 న సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఈ పథకానికి అర్హులైన వారు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకునేందుకు రూపొందించిన వెబ్‌సైట్‌ను కూడా సీఎం ప్రారంభించనున్నారు. వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా ‌ఎంపీడీవోల ద్వారా కూడా ఉచితబోరు కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =