2340 కోట్లు వ్యయంతో వైఎస్‌ఆర్‌ జలకళ, అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు

AP CM, AP CM YS Jagan, AP CM YS Jagan Launches YSR Jalakala Scheme, AP YSR Jalakala Scheme, Free Borewells to Farmers, Free Borewells to Farmers In AP, YS Jagan Launches YSR Jalakala Scheme, YSR Jalakala, YSR Jalakala Scheme, YSR Jalakala Scheme In AP, YSR Jalakala Scheme News, YSR Jalakala Scheme Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలలోకి తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయరంగానికి సంబంధించి మెట్టభూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత బోర్లు తవ్వించే “వైఎస్ఆర్ జలకళ” పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు రూ.2,340 కోట్లు వ్యయంతో రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచిత బోర్లు తవ్వించే వైఎస్ఆర్ జలకళ ద్వారా 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు సాగునీరు అందించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ జలకళ పథకంతో మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లువేయించి, వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే ఈ పథకం లక్ష్యమన్నారు. శాస్త్రీయ పద్దతిలో భూగర్భ జల సర్వే చేసి, బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నట్టు తెలిపారు. సర్వ్ ఖర్చు, బోరువేసే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

ఉచిత బోరు పథకానికి విధివిధానాలు:

  • రైతులు ఆన్ లైన్ లో నమోదు చేసుకుందుకు www.ysrjalakala.ap.gov.in వెబ్ సైట్ ఏర్పాటు.
  • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోలేని వారు, గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం.
  • గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను ముందుగా వీఆర్వో పరిశీలిస్తారు.
    అనంతరం దరఖాస్తులు డ్వామా ఏపీడీకి వెళ్తాయి. అక్కడి నుంచి దరఖాస్తులు జియాలజిస్టు వద్దకు వెళతాయి. భూగర్భ జలాల సర్వే తర్వాత అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తారు.
  • సర్వ్ ప్రకారం రైతు పొలంలో గుర్తించిన ప్రదేశంలో కాంట్రాక్టర్‌ బోరు తవ్వుతారు.
  • ఒకసారి బోర్‌వెల్‌ ఫెయిల్ అయితే మరోసారి కూడా బోర్‌ వేయనున్నారు.
  • వైఎస్ఆర్ జలకళ కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్‌ నిర్వహించనున్నారు.
  • బోరు వేయడం పూర్తయ్యాక, కాంట్రాక్టర్‌తో పాటు రైతును కూడా జియో ట్యాగింగ్‌ విధానంతో‌ ఫొటో తీయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =