ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం, సీఎం జగన్ కీలక ఆదేశాలు

andhra pradesh chief minister, AP CM YS Jagan, CBSE Procedure In Andhra Govt Schools, CBSE Procedure In Govt Schools, CBSE Procedure In Govt Schools In AP, CBSE syllabus for class 1 to 7 in AP govt schools, CBSE syllabus for classes 1 to 7 in Andhra govt schools, Govt Schools In AP, Mango News, YS Jagan Orders Officials to Implement CBSE Procedure, YS Jagan Orders Officials to Implement CBSE Procedure In Govt Schools

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగా 2021-22 నుంచి 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్ అమలోకి తేవాలని, అనంతరం ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి చొప్పున 8,9, 10 తరగతులకు కూడా ప్రవేశపెట్టాలన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికల్లా ఒకటి నుంచి పదో తరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి రావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇక విద్యాకానుకలో అందించే వస్తువులతో పాటుగా ఈసారి ఇంగ్లీష్‌-తెలుగు డిక్షనరీని చేర్చాలని సూచించారు. పాఠ్యపుస్తకాల నాణ్యత ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా ఉండాలని చెప్పారు. అమ్మ ఒడి కింద ల్యాప్ టాప్ ఆప్షన్‌ ఎంచుకునే విద్యార్ధులకు అందించే ల్యాప్ ‌టాప్‌ల క్వాలిటీ, సర్వీస్‌ బాగుండాలని సూచించారు. తొలి విడత నాడు-నేడు పనులను మార్చి నెల చివరికల్లా పూర్తిచేయడం, రెండో దశ నాడు-నేడు పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో పక్కా భవనాలు లేని 390 పాఠశాలకు భవనాల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =