ఏపీ అప్పుల కుప్ప.. షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన కాగ్

AP debt,Cog shocking report,Comptroller and Auditor General, AP Government, CM Jagan, YCP,RBI report,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP
AP debt,Cog shocking report,Comptroller and Auditor General, AP Government, CM Jagan, YCP

ఏపీ సీఎం జగన్.. అప్పులతో ఆంధ్రరాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్న ఆరోపణలు చేస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోని జగన్ సర్కార్ అదే పనిని మొండిగా చేస్తూ తమ పరిపాలనను కొనసాగిస్తుంది. ప్రజలకు , యువతకు ఉపాధి కల్పించాల్సిన ముఖ్యమంత్రి అవేమీ పట్టనట్లు ఉచిత పథకాలతో బద్దకస్తులుగా మారుస్తున్నారన్న విమర్శలను కూడా పట్టించుకోకుండా మూర్కంగా ముందుకు వెళ్లిపోతుంది.

అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని  కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  బయటకు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు పాలు అయిందన్న విషయాన్ని తాజాగా మరోసారి కాగ్ గుర్తు చేసింది. సంక్షేమ పథకాల పేరుతో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లలోకి వేస్తున్న విషయాన్ని  గుర్తు చేసిన కాగ్.. అయితే ఈ డబ్బులన్నీ అప్పలేనని  తేల్చిచెప్పింది.

ఏడాది పొడవునా ఏపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని.. కాగ్ తన రిపోర్టులో  వెల్లడించింది. అంతేకాదు తన నివేదకలో  ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలను స్పష్టం చేసింది. ఒక సంవత్సరంలో 365 రోజలుంటే..అందులో  341 రోజుల పాటు ఏదొక రూపంలో ప్రభుత్వం అప్పు చేస్తోన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

సంక్షే పథకాలతో పాటు ఏపీ అభిృవృద్ధికి జగన్ సర్కార్ చేస్తున్న ఖర్చులకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం, కేంద్రం గ్రాంట్లు కూడా సరిపోకపోవచ్చని కాగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థల నుంచి జగన్ సర్కార్ ప్రతి నెలా అప్పులు తీసుకోవాల్సిన సిచ్యువేషన్  ఏర్పడుతోందని స్పష్టం చేసింది. 2022-2023 మధ్య ఓడీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.57,066 కోట్లు అప్పులు తీసుకుందని కాగ్ తన నివేదికలో  వెల్లడించింది.

కాగ్ నివేదికతో.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇప్పటి వరకూ  ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ కాగ్ నివేదిక రావడం ఇప్పుడు  హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే జగన్ తీసుకున్న అప్పులపై ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా..ఎన్నికల ముందు కాగ్ నివేదిక వారికో అస్త్రంగా మారనుంది. సామాన్యులు కూడా షాక్ అయ్యేలా కనిపిస్తున్న కాగ్ నివేదికపై వైసీపీ నేతలు ఎలా సమాధానం చెబుతారో చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 19 =