పవన్‌ హిట్‌..బాబు,లోకేష్ ప్లాప్‌

Political speeches, Pawan hit, Babu, Lokesh flop,YCP Government, CM Jagan, YCP,Chandrababu, TDP, Pawan Kalyan, Janasena,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Political speeches, Pawan hit, Babu, Lokesh flop,YCP Government, CM Jagan, YCP,Chandrababu, TDP, Pawan Kalyan, Janasena

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రసంగాలతో పొలిటికల్ వాతావరణం వేడెక్కిపోతుంది. నేతల పవర్ ఫుల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతూ రీ సౌండ్ చేస్తున్నాయి. వారి స్పీచులలో హైలెట్స్ అన్నీరీల్స్, మీమ్స్‌ రూపంలో సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఏపీలో ఏ నేత మాట్లాడితే జనాల నుంచి జేజేలు ఎక్కువ వస్తున్నాయా అన్న లెక్కలు తెరమీదకు వస్తున్నాయి.

ఇలా అందరిలోనూ పవన్ మాట్లాడిన మాటలు తూటాలులా వైసీపీ నేతలకు తగలడమే కాదు..ప్రజల్లోనూ స్పందన ఎక్కువే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది . పవన్ నోటి వెంట వస్తున్న పంచుల్లాంటి మాటలు, అవతలివారిని పొలిటికల్ గా ఎదుర్కోవడానికి వేస్తున్న కౌంటర్లకు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ ఉంటున్నాయని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పవన్‌ తర్వాత వైఎస్ షర్మిల, నారా లోకేష్  సూపర్ హిట్ అవుతున్నాయట కానీ..నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మాటలు మాత్రం జనాలకు బోర్ కొట్టేస్తున్నాయట. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు  40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న విజన్ ఉన్న నేత. చంద్రబాబు అంటే సాంప్రదాయ రాజకీయాలు అనే పేరుంది.. అదే  చంద్రబాబు వారసుడిగా లోకేష్‌కు కూడా వచ్చింది. లోకేష్ కూడా సంప్రదాయాల పరిధి దాటి..హద్దులు దాటి  రాజకీయం చేయడం కనిపించదు.

అయితే జనాల మైండ్ సెట్ మారింది. అదే పాత చింతకాయ ప్రసంగాలను ప్రజలు కోరుకోవడం లేదు. అవతలివైపు నాయకులకు చమట్లు పట్టించేలా కౌంటర్లు ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తనను అన్న మాటలకు అంతకుమించిన రేంజ్‌లో మాటల దాడి చేయాలని కోరుకుంటున్నారు. మాటకు మాట దీటైన నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. అందుకే  ఒకప్పుడు ఏ ప్రసంగాలైతే చంద్రబాబుకి  పేరు తెచ్చాయో అవే ప్రసంగాలు ఈ రోజు బోర్ కొట్టేస్తున్నాయి. నిజానికి  చంద్రబాబు మైక్ పట్టుకుంటే చాలు.. తెలుగు తమ్ముళ్లకు కూడా నీరసాలు వచ్చేస్తున్నాయట.

తాజాగా జరిగిన తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడితే.. వచ్చిన వారంతా పవన్ ప్రసంగం అయిపోయాక వెళ్లిపోతారనే లెక్కలతోనే చివరలో పవన్ ప్రసంగం పెట్టించినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగానే చంద్రబాబు ప్రసంగంలో కనిపించని ఉత్సాహం.. పవన్ మాటలతో కనిపించింది. పవన్ మాట్లాడే ఒక్కో మాట తూటాలుగా పేలుతుంటే.. జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు సభాస్థలం  దద్దరిల్లిపోయింది. చివరకు బాలకృష్ణ మాట్లాడినా కూడా స్పందన అంతంత మాత్రమే. కానీ పవన్ స్పీచ్‌కు రోమాలు నిక్కుపొడుచుకున్నట్లే ప్రజలు ఫీలయ్యారు.

అలా పవన్ ప్రసంగం అందరిని ఊపేయగా.. బాబు ప్రసంగం  బోర్ కొట్టించేసింది. ఇటు షర్మిల పంచులు కూడా బాగా పేలుతున్నాయి. సొంత అన్నను టార్గెట్ చేస్తూ పాయింట్ అవుట్ చేస్తున్న షర్మిల మాటలకు జనాల నుంచి క్రేజీ స్పందన వస్తోంది. ఇటు  లోకేష్ ప్రసంగాలకు ఒక్కోచోట విపరీతమైన రెస్పాన్స్ రాగా.. ఇంకోచోట నీరసంగా సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, షర్మిల ప్రసంగాలు ప్రత్యర్థి నేతలకు డైరెక్ట్‌గా గుచ్చుకోవడంతో..వారి  ప్రసంగాలు వైరల్ అవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.

2019 నుంచి ఇప్పటి వరకూ కూడా టీడీపీ అధినాయకత్వం నుంచి పవన్ కళ్యాణ్ తరహా ప్రసంగాలు లేవు. విషయం మాట్లాడితే జనాలకు ఎక్కదు… పంచ్ డైలాగులు మాస్‌కు నచ్చుతాయి. ఈ విషయాన్ని పట్టుకోవడంలో చంద్రబాబు బాగా వెనుక బడ్డారు. ఇక ఏపీ సీఎం జగన్ కూడా ఎక్కడకు వెళ్లినా పవన్ పెళ్లిళ్లు తప్ప వేరే టాపిక్ లేనట్లు మాట్లాడటంతో జగన్ మాటలను జనాలు లైట్ తీసుకుంటున్నారట.

అంతెందుకు ప్రధాని మోడీ 2014 సమయంలో మాట్లాడిన ప్రసంగాల్లో ఆవేశం ఉండేది కాదు..కానీ 2019 ఎన్నికల సమయంలో ఆయన ప్రసంగాల్లో ఆవేశం చేరడంతో జనాలకు బాగా రీచయ్యారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగాలతోనే  సీఎం సీటు వరకూ వెళ్లారని వాదన గట్టిగానే ఉంది.  పిట్టకథలతోనే  ప్రతిపక్షాలకు వణుకు పుట్టించిన కేసీఆర్‌ కూడా..రేవంత్‌ పంచు డైలాగులను ఎదుర్కోలేకపోయారంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 15 =