వారి ఉద్యోగాలకు బాబు గ్యారంటీ..

Relief for volunteers,Babu's guarantee for their jobs, volunteers, YCP Government, CM Jagan, YCP,Chandrababu, TDP, Pawan Kalyan, Janasena,AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Relief for volunteers,Babu's guarantee for their jobs, volunteers, YCP Government, CM Jagan, YCP,Chandrababu, TDP, Pawan Kalyan, Janasena

ఏపీలో జగన్ ప్రభుత్వానికి  వెన్నుముకగా మారిపోయారన్న ముద్రను వాలంటీర్లు వేసుకునేంతగా.. వైసీపీ సర్కారుకు తమ సేవలను అందిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే డ్వాక్రా సంఘాలు, పెన్సనర్లు, రేషన్ తీసుకునే వాళ్లందరి ఓట్లను తమ చేతిలో ఉంచుకునే స్థాయిలో వాలంటీర్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఉంటేనే తాము ఉంటాం.. వేరే ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఈ ఉద్యోగాలుండవు  అనే అనుమానాన్ని వాలంటీర్లలో రేపుతున్నారు వైసీపీ నేతలు . దీంతో కొంతమంది వాలంటీర్లు తమకు నచ్చినా నచ్చకపోయినా  జగన్ ప్రభుత్వానికి తమ మద్దతును అందించాల్సిందేనన్న ఆలోచనలో పడ్డారు.  లేదంటే తాము రోడ్డున పడతామని ఆలోచిస్తున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

ఏపీలో ప్రభుత్వ పథకాలను డైరెక్ట్‌గా ప్రజలకే చేరవేస్తోంది వాలంటీర్ల వ్యవస్థ.  జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు.ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌  సేవలు అందించేలా సీఎం చర్యలు తీసుకున్నారు. కరోనా సమయంలో వీరు చేసిన సాయం వల్ల వాలంటీర్లపై అన్ని వర్గాల నుంచి కూడా వీరికి మంచి ఆదరణ లభించింది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే  వాలంటీర్లను కొనసాగించాలనే డిమాండ్ ప్రజల్లో వినిపించింది. అయితే  కొన్ని చోట్ల వరుసగా జరిగిన ఘటనలతో కొంతమంది వాలంటీర్లపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో వాలంటీర్ల చర్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వాలంటీర్లు చేసిన సంఘ విద్రోహ చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో  వైసీపీ నేతలు దీనిని అవకాశంగా తీసుకుని తాముంటేనే వాలంటీర్లు ఉంటారని లేదంటే వాలంటీర్లు  రోడ్డున పడతారన్న భావన కలిగించారు. దీంతో వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను తీసివేస్తామని అనడంపై ఆవేదన  వ్యక్తం చేశారు. అటు ఏపీ ప్రజల నుంచి కూడా ప్రతిపక్ష నేతలపై వ్యతిరేకత వచ్చింది.

దీంతో   అప్రమత్తమయిన చంద్రబాబు ఈ వార్తలను అలాగే వదిలేస్తే..తాము వాలంటీర్ల నుంచి ప్రజల నుంచీ కూడా వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని భావించారు. ఎన్నికల సమయంలో దీనికి చెక్ పెట్టాలని అనుకున్న చంద్రబాబు.. అనంతపురం జిల్లా కదిలి రా సభలో వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.  తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసివేస్తామన్న వార్తలు నమ్మొద్దని..ఎప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని బాబు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వాలంటీర్లకు తమ ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉంటుందని, జీతాల విషయంలో కూడా వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు భయం పోయింది కాబట్టి ఈ ఎన్నికలలో వైసీపీ కోసం వాలంటీర్లు పని చేయొద్దని చంద్రబాబు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =