వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’

AP Deputy CM Amjad Basha and Minister Adimulapu Suresh Unveils Rayalaseema Garjana Poster,Rayalaseema Garjana,YSRCP Kurnool Rayalaseema Garjana,YSRCP Rayalaseema Garjana,Mango News,Mango News Telugu,AP Deputy CM Amjad Basha,Minister Adimulapu Suresh,Rayalaseema Garjana Poster,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న ‘రాయలసీమ గర్జన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మరియు మంత్రి ఆదిమూలపు సురేష్ రాయలసీమ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాయలసీమ గర్జనను విజయవంతం చేయాలని, తద్వారా సీమ ప్రజల ఆకాంక్షను చాటిచెప్పాలని కోరారు. ఇప్పుడు కాకపోతే దీనిని ఇంకెప్పుడూ సాధించుకోలేమని పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని సూచించిందని మంత్రులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు సహా పలువురు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here