బీజేపీ జాతీయ కార్యవర్గంలో కెప్టెన్ అమరిందర్ సింగ్, సునీల్ జాఖర్ కు చోటు

BJP Appoints Former Punjab CM Captain Amarinder Singh Sunil Jakhar as Members of the National Executive,Amarinder Singh BJP National Executive,BJP National Executive Sunil Jakhar,Former Punjab CM Captain Amarinder Singh,Former CM Captain Amarinder Singh,Captain Amarinder Singh,Mango News,Mango News Telugu,BJP,BJP News,Modi News,Pm Modi News Today Live,BJP Telangana,BJP Party,Bharatiya Janata Party,Bharatiya Janata Party President,Bharatiya Janata Party News,

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరియు మాజీ ఎంపీ సునీల్ జాఖర్‌లను శుక్రవారం బీజేపీ తన జాతీయ కార్యవర్గంలోకి చేర్చుకుంది. అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ (పీఎల్సీ) ని స్థాపించి, ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపలేదు, ఈ క్రమంలో అమరీందర్ సింగ్ గత సెప్టెంబర్‌లో తన పీఎల్సీని బీజేపీలో విలీనం చేసి, బీజేపీలో చేరారు. అలాగే పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ గత మేలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో వీరిద్దరిని తాజాగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వతంతర్‌దేవ్ సింగ్ కు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు.

అలాగే పంజాబ్ బీజేపీ నేతలు రాణా గుర్మిత్ సింగ్ సోధి, మనోరంజన్ కాలియా, అమంజోత్ కౌర్ రామూవాలియా లకు, ఛత్తీస్ గడ్ నుంచి పార్టీ నేత విష్ణు దేవ్ సాయి మరియు ఉత్తరాఖండ్ నుండి పార్టీ నేత మదన్ కౌశిక్ లకు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు కల్పించారు. వీరిలో రాణా గుర్మిత్ సింగ్ సోధి కూడా గతంలో కాంగ్రెస్ నుంచే బీజేపీలో చేరారు. ఇక గత ఆగస్టులో కాంగ్రెస్‌ ను వీడి బీజేపీలో చేరిన పంజాబ్‌కు చెందిన మరో నేత జైవీర్ షెర్గిల్ ను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారని తెలుపుతూ, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here