వచ్చే ఎన్నికల్లో గుడివాడలో చంద్రబాబు, లోకేష్‌లు వచ్చి పోటీ చేసినా సరే, గెలుపు నాదే – మాజీ మంత్రి కొడాలి నాని

Ap Ex Minister Kodali Nani Challenges Tdp Chief Chandrababu Naidu To Contest In Gudivada,Chandrababu Next Election, Lokesh Next Election, Contest In Gudiwada Next Election, Next Election Will Win, Former Minister Kodali Nani,Mango News,Mango News Telugu,Ap Ex Minister Kodali Nani,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. సోమవారం తన సొంత నియోజకవర్గం గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే నాని వచ్చే ఎన్నికల్లో గుడివాడలో పోటీ చేసే అంశంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు లేదా, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు వచ్చి పోటీ చేసినా సరే వైసీపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని, అలాగే గెలిచేది కూడా తానేనని పేర్కొన్నారు. గుడివాడలో ఎవరికీ భయపడేది లేదని, కుల సంఘాల నుంచి చందాలు వసూలు చేసి వేల కోట్లు డబ్బులు తెచ్చినా సరే గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని వ్యాఖ్యానించారు. ఇక గుడివాడలో గెలుపోటములను నిర్ణయించేది ప్రజలే తప్ప.. ఎన్నారైలు, పొలిటికల్ ఎనలిస్టులు కాదని కొడాలి నాని తెలిపారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా గుడివాడలో అభివృద్ధి పనుల నిమిత్తం రావాల్సిన రూ.1,000 కోట్లు ఆపేశారని, జగన్ సీఎం అయ్యాకే నియోజకవర్గానికి రావాల్సిన నిధులు సక్రమంగా అందుతున్నాయని మాజీ మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారని, ఆయన నిర్వహించే రోడ్ షోలకు ముందురోజే జనాన్ని అక్కడకు తరలిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలే తనకు చివరివని చంద్రబాబు చెప్తున్నారని, ఆయనకే కాదని.. టీడీపీకి కూడా వచ్చే ఎన్నికలే చివరివని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అవ్వకపోతే జనాలకు పోయేదేమీ లేదని, సీఎం జగన్ బ్రతికి ఉన్నంతకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటాడని అన్నారు. ఇక తాను చివరి రక్తపు బొట్టు వరకూ సీఎం జగన్ వెంటే ఉంటానని, రాష్ట్రంలో వైసీపీ గెలుపు కోసం పోరాడుతానని కొడాలి నాని తేల్చి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here