అన్న‌ను వెంటాడుతున్న బాణం

AP Congress Chief YS Sharmila Targeting CM Jagan, AP Politics, AP State political, CM Jagan Mohan Reddy Speech, CM YS Jagan Fire On YS Sharmila, Jagan Campaign In AP, Jagan Comments On TDP, Jagan Mohan Reddy Campaign In AP, Jagan Mohan Reddy Latest News, Jagan Political Speech, Jagan Speech, TDP vs YSRCP, Mango News, Mango News Telugu
AP State political, Elections , Nominations , YSRCP , Congress party

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. నేటితో నామినేష‌న్ల ప‌ర్వం ముగుస్తుండ‌డంతో.. ఇక ప్ర‌చార ప‌ర్వాన్ని మ‌రింత ర‌క్తిక‌ట్టించ‌డానికి ఆయా పార్టీలు స‌మాయ‌త్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌త్య‌ర్థుల‌ను ఓడించటమే లక్ష్యంగా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూనే, నామినేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాగా, 175 శాస‌న‌స‌భ స్థానాల‌కు గాను మంగళవారానికి ఎమ్మెల్యే స్థానాలకు 620, ఎంపీ స్థానాలకు 111 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఇందుకోసం వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష‌, విప‌క్షాల మాధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఏపీలో ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటుంటే.. చంద్ర‌బాబు, ఆయ‌న ద‌త్త‌పుత్రుడు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు.

టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి వైసీపీకి మ‌ధ్య రాజ‌కీయం ఒక‌లా ఉంటే.. అన్న‌కు చెల్లెలికి మ‌ధ్య రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. అన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ల‌క్ష్యంగా చెల్లెలు , కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల ప్ర‌తిస‌భ‌లోనూ బాణాలు సంధిస్తున్నారు. ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌కు జ‌గ‌న్ అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా కౌంట‌ర్లు ఇస్తున్నారు. ష‌ర్మిల మాత్రం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను, తీరును సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. అన్న జ‌గ‌న్ ప్ర‌చారాన్ని, ఆయ‌న  చెబుతున్న మాట‌లను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్న ష‌ర్మిల.. ఆయ‌న‌ను ఎద్దేవా చేస్తూ ప్ర‌సంగాలు చేస్తున్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగిన వైసీపీ సోష‌ల్‌మీడియా స‌మావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఉద్దేశించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఫైర్ అయ్యారు.

ఆ స‌మావేశంలో బొత్స‌ను ఉద్దేశించి జ‌గ‌న్ మాట్లాడుతూ.. త‌న‌కు తండ్రి స‌మానులు.. మంచోడు.. నేను అన్న పిలిచే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను భారీ మెజారిటీ గెలిపించాల‌ని వ్యాఖ్యానించారు. దీనిపై షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్‌కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను పేపర్‌లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘ఇదే బొత్స వైఎస్సార్‌ను గుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్‌కు ఉరి శిక్ష వేయాలని అన్నాడు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. విజయమ్మ ను సైతం అవమాన పరిచాడు. ఇలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు’’ అంటూ ఎద్దేవా చేశారు.

అలాగే.. జగన్ క్యాబినెట్‌లో ఉన్న వాళ్ళందరు వైఎస్సార్‌ను తిట్టిన వాళ్ళే అని విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ తండ్రులు, అక్కలు, చెల్లెల్లు అంటూ సెటైర్ విసిరారు. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్ళు ఈయనకు ఏమీకారని ప‌రోక్షంగా చెల్లిని ప‌ట్టించుకోక‌పోవ‌డంపై మాట్లాడారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఆమె బాధ్య‌త‌లు స్వ‌క‌రించిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌ధానంగా జ‌గ‌నే ల‌క్ష్యంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. అన్నను గ‌ద్దె దింప‌డ‌మే ధ్యేయంగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తుండ‌డం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − five =