సినిమా హాళ్లు తెరవలేం, ఈ పరిస్థితుల్లో తెరవాలంటే అదనంగా లక్షల ఖర్చు

AP exhibitors decide not to reopen cinema theatres, AP Exhibitors Not Open Theaters, AP Theaters, AP Theaters Reopen, AP Theaters Reopen News, AP Theaters Reopen Updates, Cinemas to have a cautious reopening, Exhibitors not keen on opening cinemas, Film exhibitors on reopening of theatres, Theatres to continue to stay shut in Andhra Pradesh

అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15‌ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై బుధవారం నాడు విజయవాడలోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ కార్యాలయంలో ఏపీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్ సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి మొత్తం 13 జిల్లాల ఎగ్జిబిటర్స్ హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎగ్జిబిటర్స్ మాట్లాడుతూ అక్టోబర్ 15 (నేటి) నుంచి థియేటర్స్ తెరవలేమని స్పష్టం చేశారు.

50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్స్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ తెరవాలంటే అదనంగా లక్షల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 24 మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు నడపాలంటే ప్రేక్షకులపై కూడా అదనపు భారం పడే అవకాశముందని వెల్లడించారు. తాజా ఏపీ ఎగ్జిబిటర్స్ నిర్ణయంతో ఏపీలో థియేటర్స్ ప్రారంభానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =