నారా లోకేష్ కి కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ

Andhra Pradesh, Andhra Pradesh Department of Health, AP, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Lokesh positive for Covid, Mango News, MLC Nara Lokesh Tested Positive for COVID-19, Nara Lokesh, Nara Lokesh Tested Positive, Nara Lokesh Tested Positive for COVID-19, TDP Leader, TDP Leader MLC Nara Lokesh, TDP urges CM to close schools

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు మరియు బాగానే ఉన్నాను. కానీ కోలుకునే వరకు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =