తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత

Popular Telugu Dubbing Artist Srinivasa Murthy Passes Away,Srinivasa Murthy Dubbing Artist Wiki,Srinivasa Murthy Dubbing Artist Father,Srinivasa Murthy Dubbing Artist Instagram,Mango News,Mango News Telugu,Surya Voice Dubbing Artist In Hindi,Dubbing Artist Vasu,Dubbing Artist Srinivasa Murthy Remuneration,Dubbing Artist For Vikram In Telugu,Dubbing Artist Srinivasa Murthy Family Photos,Dubbing Artist Srinivasa Murthy Age,Dubbing Artist Srinivasa Murthy Father,Dubbing Artist Auditions In Chennai,Telugu Dubbing Artist Srinivasa Murthy Wikipedia,Dubbing Artist Salary In Chennai

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మరణించారు. కాగా ఈరోజు ఉదయమే ప్రముఖ సినీనటి జమున మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఈరోజు ఉదయం చైన్నైలో గుండెపోటుతో మరణించడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక శ్రీనివాస మూర్తి.. ప్రముఖ దక్షిణాది హీరోలు సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్ మరియు రాజశేఖర్ వంటి చాలా మందికి తన గాత్రాన్ని అందించారు. శ్రీనివాస మూర్తి తన కెరీర్ లో వెయ్యికి పైగా సినిమాలకు తన గళాన్ని అందించారు. పలు హాలీవుడ్, బాలీవుడ్ మరియు ఇతర దక్షిణాది ప్రాంతీయ భాషల చిత్రాలను తెలుగులోకి అనువదించే సందర్భంలో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ కోసం నిర్మాతలు, దర్శకులు శ్రీనివాస మూర్తి సహకారాన్ని కోరేవారు.

ముఖ్యంగా తమిళ హీరో సూర్య నటించిన సింగం సిరీస్ సినిమాలు చూసినవారికి శ్రీవివాస మార్తి గాత్రం గుర్తుండే ఉంటుంది. అయితే సినిమా పరిశ్రమలో అత్యంత కీలకమైన విభాగం అయినప్పటికీ, డబ్బింగ్ ఆర్టిస్టులు తెరవెనుక పని చేయడం వల్ల అంతగా ప్రజాదరణకు నోచుకోరు. కానీ శ్రీనివాస మూర్తి కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల సినీ అభిమానులకు ఆయన కొంచెం పరిచితమే. ఇక రాజశేఖర్ హీరోగా నటించిన తెలుగు సినిమా ‘శివయ్య’కు గానూ ఆయన 1998లో ఉత్తమ ‘మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌’గా నంది అవార్డును అందుకున్నారు. శ్రీనివాస మూర్తి లాంటి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి చెందడంపై తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ కూడా సంతాపం తెలిపింది. కాగా ప్రస్తుతం యూకేలో ఉన్న శ్రీనివాస మూర్తి కుమారుడు వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =