ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, డిసెంబర్ 25 న ఇళ్ల పట్టాల పంపిణీ

Andhra government, Andhra Pradesh Government, AP Government, AP Government Decided to Distribute House Plots, AP Government to Distribute House Plots, AP Govt To Distribute House Sites, AP House Plots Distribution, House Plots Distribution, House Plots Distribution In AP, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్‌ 25 వ తేదీన ప్రారంభం కానుంది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 30 లక్షల మందికి లబ్ధిదారులను గుర్తించింది. కాగా డిసెంబర్ 25 న కోర్టు స్టే ఉన్న ప్రాంతాలలో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పట్టాలపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆతర్వాత ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేపట్టాలని భావించారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పలుమార్లు వాయిదా వేసింది. తాజాగా డిసెంబర్‌ 25న అర్హులైన లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసి ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించారు. పట్టాలు అందించిన వెంటనే నిర్మాణాలు చేపట్టి తొలి దశలో దాదాపుగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eight =