రాజకీయ పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ

Jai Bharat National Party in AP, Jai Bharat National Party, AP Jai Bharat National Party, JD Lakshminarayana New Political Party, Former JD of CBI Lakshmi Narayana, Jai Bharat National Party In AP, Former CBI JD Who Was Nominated, Political Party, JD Lakshminarayana, JD Lakshminarayana New Party, New Political Party, Political News, AP CM, CM Jagan, Latest Political News,AP News, Mango News, Mango News
JD Lakshminarayana New Political Party,Former JD of CBI Lakshmi Narayana ,Jai Bharat National Party in AP, Former CBI JD who was nominated, political party

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉండగా.. ఇలాంటి సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరును జై భారత్ నేషనల్ పార్టీ పేరుగా శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఇది సాధారణంగా పెట్టిన పార్టీ కాదని.. ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తేవడం కోసమే తమ పార్టీ పుట్టిందని.. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని చూడటానికి  పుట్టిన పార్టీ అన్నారు.  ఈ సందర్భంగా జై భారత్ నేషనల్ పార్టీ జెండాను.. లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. పార్టీ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు.. లక్ష్మీ నారాయణ పిడికిలి బిగించినట్లుగా ఉన్న ఫోటో కూడా ముద్రించి ఉన్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతాన్ని తాము ముందుకు తీసుకు వెళ్లడానికే ఈ పార్టీ పెడుతున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకు రావడానికి తమ పార్టీ నాంది పలుకుతుందని హామీ ఇచ్చారు. దేశంలో ఇప్పుడు రాజకీయ పార్టీల పరిస్థితి అయోమయంగా ఉందని, రాజకీయాలంటేనే ప్రజల్ని మోసం చేయడం అనే అభిప్రాయం అందరిలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలంటే సుపరిపాలన అని చెప్పడమే తమ పార్టీ సిద్ధాంతమని లక్ష్మీనారాయణ అన్నారు.

అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా విషయమై కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేశారని మాజీ జేడీ ఆరోపించారు. ప్రత్యేక హోదా రాకపోవడంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు అవకాశం వచ్చినా కూడా  అడిగే ధైర్యం ఎవరికీ లేదంటూ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ.. తమ పార్టీ అని అన్నారు.

ఇక లక్ష్మీ నారాయణ పొలిటికల్ కెరీర్ గురించి చూసుకుంటే..సీబీఐలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి వెళ్లి  ఆయన సేవలు అందించారు. కానీ అనూహ్యంగా ఐపీఎస్ కు రాజీనామా చేసి మరీ పాలిటిక్స్ లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి ఎంపీగా  పోటీచేసి ఓడిపోయారు.  ఆ తర్వాత పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తుండటంతో జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలంగా రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 17 =