విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వాల్తేరు స్థానంలో రాయ‌గ‌డ కేంద్రంగా కొత్త డివిజ‌న్ కూడా!

Central Government Gives Green Signal To Visakhapatnam Railway Zone For AP, Visakhapatnam Railway Zone For AP, Central Government Gives Green Signal To Visakhapatnam Railway Zone, Visakhapatnam Railway Zone, Central Government, Visakha Railway Zone, newest railway zone of the Indian Railways, Visakha Railway Zone Is The newest railway zone of the Indian Railways, Indian Railways, South Coast Railway Zone, South Coast Railway Zone headquartered at Visakhapatnam, Visakhapatnam, South Coast Railway Zone headquarters at Visakhapatnam, AP, Visakha Railway Zone Latest News, Visakha Railway Zone Latest Updates, newest railway zone In AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా ద‌క్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న రాజ్య‌సభ‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ రైల్వే జోన్ అంశంపై అడిగిన ఒక ప్ర‌శ్న‌కు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జవాబిచ్చారు. విశాఖ కేంద్రంగా ద‌క్షిణ కోస్తా రైల్వేజోన్‌కు, అలాగే వాల్తేరు స్థానంలో రాయ‌గ‌డ కేంద్రంగా కొత్త డివిజ‌న్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదించింద‌ని రైల్వేశాఖ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఈ రెండు రైల్వేజోన్స్ కోసం 2020-21 బడ్జెట్ లో 170 కోట్లు కేటాయించినట్లు మంత్రి గుర్తుచేశారు. దీనిపై విశాఖపట్నంలోని సదరన్ రైల్వే ఓఎస్డీకి సంచారమిచ్చామని, త్వరలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. జోన్ ఏర్పాటులో ప్రధానమైన భూమి కోసం సర్వే చేయాలని, ప్రధాన కార్యాలయం కోసం.. అలాగే నివాస సముదాయాలకు లేఅవుట్ రెడీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉనికిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేని పునర్విభజన చేసి వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ప్రస్తుతమున్న వాల్తేరు డివిజన్ బదులుగా రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =