మరో ఘనత సాధించిన విరాట్ కోహ్లీ, ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్ దాటిన ఫాలోవర్స్‌ కౌంట్

Virat Kohli Becomes First Cricketer First Indian To Reach 200 Million Followers On Instagram, Virat Kohli Becomes First Indian To Reach 200 Million Followers On Instagram, Virat Kohli Becomes First Cricketer To Reach 200 Million Followers On Instagram, 200 Million Followers On Instagram, Former India and RCB captain Becomes First Cricketer First Indian To Reach 200 Million Followers On Instagram, Virat Kohli became the first Indian to have 200 million followers on Instagram, Royal Challengers Bangalore captain, Former India captain, Former India captain Virat Kohli, RCB captain Virat Kohli, Virat Kohli, 200 million followers, Instagram 200 million followers, Instagram followers, Mango News, Mango News Telugu,

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గానే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ కు సంబంధించి దేశంలో ఈ మైలురాయి చేరుకున్న తొలి ఇండియన్ సెలబ్రెటీగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇన్‌స్టాలో 20 కోట్లకుపైగా (200 మిలియన్ల) ఫాలోవర్స్ సంపాదించి కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. దీంతో ఇన్‌స్టాలో 200 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి మరియు ఏకైక ఆసియా వ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

“200 మిలియన్ స్ట్రాంగ్. మద్దతు ఇచ్చినందుకు ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు” అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్‌ చేశాడు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ కు సంబంధించి క్రీడాకారుల్లో పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోని అత్యధికంగా 451 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అర్జెంటైనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ 334 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 200 మిలియన్ ఫాలోవర్స్ తో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక కోహ్లీకి సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్‌లో 48.4 మిలియన్లకు పైగా, పేస్ బుక్ లో 49 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here