పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలే వైసీపీ మేనిఫెస్టో – సీఎం జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ నాలుగేళ్ల వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Attends Celebrations of Four Years Completed For CM Jagan's Praja Sankalpa Yatra,AP Govt Advisor Sajjala Ramakrishna Reddy,Sajjala Ramakrishna Reddy,Celebrations of CM Jagan's Praja Sankalpa Yatra,CM Jagan's Praja Sankalpa Yatra,Praja Sankalpa Yatra,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో చేసిన పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు మరియు రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి మరియు ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాడు వైఎస్ జగన్ 341 రోజుల్లో 3,648 కి.మీ దూరం పాదయాత్ర చేశారని, తన పాదయాత్రలో ఎందరో ప్రజల కష్టాలను స్వయంగా చూశారని, వీటినే అప్పటి ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోగా రూపొందించారని తెలిపారు. అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 98 శాతం నెరవేర్చామని, ఆ ధైర్యంతోనే సీఎం జగన్ ఎమ్మెల్యేలను ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల ఇళ్ల వద్దకే పంపిస్తున్నారని సజ్జల వెల్లడించారు. ఇక చంద్రబాబు – పవన్ సమావేశాన్ని వామపక్షాలు ఆహ్వానిచండం ఆశ్చర్యంగా ఉందని, పొత్తుల ముసుగులో పగటి వేషగాళ్లు వస్తున్నారని, ప్రజలు విజ్ఞతతో ఉండాలని సజ్జల సూచించారు. ఒక బలవంతమైన నాయకుడిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, అయితే ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వెంటిలేటర్ పైన ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నామని, కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 5 =