రికార్డ్ బ్రేక్ అవుతుందా? సెంటిమెంటు పనిచేస్తుందా?

Ganta Srinivas Breaks The Sentiment, Breaks The Sentiment, Ganta Srinivasa Rao, Avanthi Srinivas, Chandrababu, Ganta Srinivas Breaks The Sentiment, YSPARCP, TDP, Jana Sena, BJP, Congress, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Ganta Srinivasa Rao,Avanthi Srinivas, Chandrababu, Ganta Srinivas breaks the sentiment, YSPARCP, TDP, Jana Sena, BJP, Congress

ఎన్నికలలో గెలవడం తప్ప ఓడిపోవడం అనే మాట వినని నేతగా  గంటా శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. పవర్ పాలిటిక్స్ కు ఎక్కువగా ఆసక్తి చూపించే గంటా..1999 నుంచి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వస్తున్నారు.  కేవలం అధికారం కోసం తగిన  ఎన్నికల వ్యూహాలతో ఆయన ముందుకు సాగుతుంటారు. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గంలో.. మరోసారి చేయరు.

అయితే  ఇలా ఇప్పటి వరకు గంటా నాలుగు నియోజకవర్గాలను మార్చుతూ వచ్చిన గంటా.. ఈసారి దానికి విరుద్ధంగా వెళుతున్నారు. గత ఎన్నికలలో తాను పోటీ చేసిన భీమిలి నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలో దిగుతున్నారు. దీంతో తన  ఆనవాయితీని కాదని బరిలోకి దిగిన గంటా..ఈ ఎన్నికలలో రికార్డు బ్రేక్ చేస్తారా అన్న చర్చ మొదలయింది.

1999 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా తొలిసారిగా గంటా శ్రీనివాస రావు పోటీ చేసి.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2004లో మాత్రం చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో పార్టీ మారి ప్రజారాజ్యం కండువా కప్పుకుని… ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ గెలుపొందారు.

2014 ఎన్నికలకు ముందు మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి.. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి  పోటీ చేసి గెలుపును మరోసారి తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పటివరకు కూడా ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత…  అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయని గంటా శ్రీనివాసరావు..ఈ ఎన్నికల్లో మాత్రం ఆ ఆనవాయితీని పక్కన పెట్టారు.ఈ సారి భీమిలి అసెంబ్లీ సీటు నుంచి రెండోసారి పోటీ చేస్తుండటంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గంటాకు ఫాలో అవుతున్న ఆనవాయితీని గుర్తు పెట్టుకున్న  టీడీపీ అధినేత చంద్రబాబు .. గంటాకు చీపురుపల్లి అసెంబ్లీ సీటును కేటాయించగా.. గంటా మాత్రం బొత్సపై పోటీ చేయడానికి వెనుకడుగు వేశారు. భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్‌పై వ్యతిరేకత ఉండటంతో అక్కడ నుంచి పోటీ చేస్తానని అధినేతకు విన్నవించుకుని మరి  భీమిలిని దక్కించుకున్నారు.

అయితే ఇప్పటి వరకూ నియోజకవర్గాలు మార్చే గంటా..ఈ సారి ఆ సెంటిమెంటును పక్కన పెట్టి మరీ భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం హాట్ టాపిక్ అయింది.  ఇప్పటి వరకూ గెలుపు వీరుడిగా ముద్ర వేసుకున్న గంటా..ఈసారి తన  సెంటిమెంట్‌ను కాదని విజయాన్ని సాధించగలరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 4 =