ఏపీలో సవరించిన ఓటర్ల జాబితా వివరాలివే, మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?

Andhra Pradesh New Voters List, Andhra Pradesh New Voters List 2022, Andhra Pradesh New Voters List Released, andhra pradesh voter list, check my name in voter list 2022, download voter list, EC electoral rolls, EC electoral rolls news, Final Electoral rolls published, Mango News, Mango News Telugu, New Voters List, Revised Voters List in Andhra Pradesh, Revised Voters List Released in Andhra Pradesh, voter list 2022 Andhra Pradesh, voter list village wise Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022 అనంతరం సవరించిన ఓటర్ల జాబితా వివరాలను జనవరి 5, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ తెలియజేశారు. జిల్లాల వారీగా చేర్పులు, తొలగింపులు మరియు జెండర్ వారీగా ఓటర్ల వివరాలను వెల్లడించారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279 కు చేరుకుంది. పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉన్నారు.

ఏపీలో సవరించిన ఓటర్ల తుది జాబితా గణాంకాలు :

  • మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య – 175
  • మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 45,950
  • ఏపీలో మొత్తం ఓటర్లు – 4,07,36,279
  • మొత్తం పురుష ఓటర్ల సంఖ్య – 2,01,34,664
  • మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య – 2,05,97,544
  • థర్డ్ జెండర్ ఓటర్ల మొత్తం సంఖ్య – 4,071
  • కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య – 1,69,916
  • సర్వీస్ ఓటర్ల మొత్తం సంఖ్య – 67,935
  • ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య – 7,033
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =