మునుగోడు ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈసీ

Munugode By-poll EC Issues Notice to Minister Jagadish Reddy Over His Remarks on Continuation of Welfare Schemes, EC Issues Notice to Minister Jagadish Reddy, Jagadish Reddy Over His Remarks on Continuation, Welfare Schemes, Mango News,Mango News Telugu, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. తాజాగా ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి సంక్షేమ పథకాల కొనసాగింపుపై చేసిన వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ మంత్రి జగదీశ్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అక్టోబర్ 25వ తేదీన మంత్రి మాట్లాడుతూ.. మునుగోడు ఓటర్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్థిని ఎన్నుకోకుంటే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వ్యాఖ్యానించినట్లుగా ఫిర్యాదు అందిందని తెలిపింది.

ఈసీకి అందిన ఫిర్యాదులో.. ‘రూ. 2,000 పెన్షన్ కొనసాగించాలా వద్దా?, రైతు బంధు కొనసాగించాలా వద్దా?, 24 గంటల ఉచిత కరెంటు కొనసాగించాలా వద్దా? అని అన్నారని, ఎవరికైనా పెన్షన్‌పై ఆసక్తి లేకపోతే ప్రధాని మోదీకి, పథకాలు కావాలంటే మాత్రం సీఎం కేసీఆర్‌కు ఓటేయవచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారని దిలీప్ కుమార్ ఫిర్యాదులో వెల్లడించారని పేర్కొంది. అలాగే మంత్రి చేసిన ప్రసంగం ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను ప్రాథమికంగా ఉల్లంఘించడమేనని, అన్ని రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు అవినీతి పద్ధతులు మరియు ఎన్నికల చట్టం ప్రకారం నేరాలు, అన్ని కార్యకలాపాలను నిశితంగా నివారించాలని పేర్కొంది. దీనిపై శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాల్సిందిగా సూచించింది. లేని పక్షంలో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోబడతాయని కూడా హెచ్చరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − one =