ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రైవేటు ల్యాబ్స్ లో కూడా కరోనా పరీక్షలు

ap corona tests, AP Coronavirus, AP Coronavirus Updates, AP Govt Gives Permission to ICMR, corona tests in ap, Corona Tests In Private Labs, Corona Tests In Private Labs in AP, ICMR Approved Private Labs to do the Corona Tests

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కరోనా వైద్య‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్‌లకు కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా కేవలం ఐసీఎంఆర్ అనుమతి పొందిన ప్రైవేట్ ల్యాబ్‌ల్లోనే పరీక్షలు జరిపేందుకు అనుమతిచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబ్స్ లో చేసే కరోనా పరీక్షలకు సంబంధించి ధరను నిర్ణయిస్తూ జూన్ 12, శుక్రవారం నాడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ద్వారా వచ్చిన నమూనాలకు రూ.2,400 చొప్పున, ఎవరైనా వ్యక్తిగతంగా సంప్రదిస్తే రూ.2,900 చొప్పున వసూలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు శుక్రవారం ఉదయానికి విదేశాలు, ఇతర రాష్ట్రాలనుంచి రాగా కరోనా నిర్ధారణ అయిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5636 కు చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =