ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Andhra Pradesh Government, Andhrapradesh Government Employees, AP Govt, AP Govt has Decided Pay All 3 Pending DAs, AP Govt has Decided Pay All 3 Pending DAs to Govt Employees, AP News, CM agrees to release pending DA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మూడు కరువు భత్యం(డీఏ)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపుల కార్యాచరణను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జూలై 2018 అప్పటి మొదటి డీఏను 2021 జనవరి నెల జీతాల్లో చెల్లించనున్నారు. జనవరి 2019 అప్పటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో, అలాగే జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. మరోవైపు కరోనా లాక్ డౌన్ సమయంలో కొంతమేర వాయిదా వేసిన జీతాలను కూడా నవంబర్ నుంచి ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల పట్ల సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =