జనసేన హెచ్చరికతో కదిలిన యంత్రాంగం, రాజోలు రోడ్డుకి మోక్షం

AP Roads and Buildings Department Started Patchwork on Razole Bypass After Janasena Warning,AP Roads and Buildings Department Started Patchwork,Started Patchwork on Razole Bypass,Started Patchwork After Janasena Warning,Mango News,Mango News Telugu,Razole Bypass After Janasena Warning,Janasena Warning on Razole Bypass,Janasena Warning,AP Roads and Buildings,Patchworks start on Razole bypass,Janasena Chief Pawan Kalyan Deadline,Jana Sena Party,Razole Bypass Latest News,Razole Bypass Latest Updates,Razole Bypass Live News,Patchwork on Razole Bypass News Today,Patchwork on Razole Bypass Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగేళ్లుగా అదే తంతు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం. దాంతో రాజోలు బైపాస్ రోడ్డు పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరోడ్డున రాకపోకలు దినదినగండంగా మారాయి. పెద్ద పెద్ద గోతులు గా మారడంతో చుట్టు పక్కల ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు కూడా ఇబ్బంది పడేవారు.

ఈ సమస్యను ఇటీవల కొందరు స్థానికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్ళారు. రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ముందు ఆవేదన వ్యక్తపరిచారు. అనునిత్యం తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను జనసేనాని దృష్టిలో పెట్టడంతో ఆయన స్పందించారు. మలికిపురం బహిరంగసభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఘాటుగా జనసేన చీఫ్‌ చేసి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు లాంటివి కట్టలేరు సరే కనీసం రాజోలులో రోడ్డు కూడా వేయలేరా అంటూ ఎద్దేవా చేశారు. బైపాస్ రోడ్డు దుస్థితిని ఎండగట్టారు. ప్రభుత్వానికి తాను వారం రోజులు గడువు ఇస్తున్నట్టు డెడ్ లైన్ పెట్టారు. ఆలోగా రోడ్డు బాగుపడకపోతే తామే రోడ్డుని పునర్నిస్తామని హెచ్చరించారు. తాను స్వయంగా ముందుండి రాజోలు రోడ్డు పూర్తిచేస్తానని కూడా ప్రకటించారు.

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు సమస్యల మీద పవన్ కళ్యాణ్‌ స్పందించారు. ఆయన ముందుకొచ్చిన తర్వాత అనేక రోడ్లను ప్రభుత్వం బాగుచేయించింది. ముఖ్యంగా పవన్ వార్నింగ్ ఇచ్చిన ప్రతీ రోడ్డుని బాగుచేసిన తరుణంలో రాజోలు వ్యవహారంలో కూడా పవన్ ప్రకటన తర్వాత స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం రంగంలో దిగింది. రాజోలు బైపాస్ రోడ్ నిర్మాణం పనులు మొదలెట్టింది. పవన్ చెప్పినట్టుగా వారం తిరగకముందే ప్రభుత్వం ఈ రోడ్డు పూర్తి చేయడం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. పవన్ హెచ్చరికతో ప్రభుత్వం దిగివచ్చిందనే సంతోషం స్థానికంగా వ్యక్తమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + three =