ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం

Adimulapu Suresh, AP Education Minister, AP Education Minister Adimulapu Suresh, AP Primary Schools, AP Primary Schools to be Start, AP Primary Schools to be Start from February 1st, AP Schools Reopen News, AP schools reopening 2021, AP Schools Reopening Date, AP Schools Reopening News, Mango News, Minister Adimulapu Suresh, Minister Adimulapu Suresh Press Meet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 10 వ తరగతి నుంచి 6 వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాథమిక పాఠశాలల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1, సోమవారం నుంచి 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య మరియు తరగతి గదుల ఆధారంగా ప్రాథమిక పాఠశాలల నిర్వహణ ఉంటుందని మంత్రి తెలిపారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

తరగతి గదులు సరిపడా లేని చోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామని అన్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు తల్లిదండ్రులు నుంచి లిఖితపూర్వక అంగీకార పత్రం సమర్పిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. అన్ని కరోనా నిబంధనలు అమలు చేస్తూనే తరగతులు నిర్వహణ కొనసాగుతుందని, అందుకోసం అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =