ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షాక్.. గవర్నర్‌ను కలవడంపై నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం

AP Govt Issues Notices To Employees Union APGEA Seeks Explanation on Meeting Governor,Ap Government Shock To Employees Association,Government Issued Notices,Notices On Meeting The Governor,Mango News,Mango News Telugu,Ap Government Employees Association,Ap Survey Employees Association,Ap Treasury Employees Association,Service Rules For A P State Government Employees,Employees Association Registration,Apgea President,Ap Vro Association,Ap Govt Employees,Ap State Government Retired Employees Association,Ap Government Employees Allowances,Ap Government Employees List,Ap Govt Service Rules,Ap Government Employee Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి (ఏపీజీఈఏ) షాక్ ఇచ్చింది. ఏపీజీఈఏ సభ్యులు ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో వారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తగిన కారణం చెప్పాలని ఆయా ఉద్యోగులను వివరణ కోరింది. ఈ మేరకు అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. మీడియాలో, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు అందులో స్ఫష్టం చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతనాలు, ఇతర ఆర్థిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నా, వాటిని కాదని వారు గవర్నర్‌ను ఎందుకు కలిశారు? అని ప్రభుత్వం అసోసియేషన్‌ను ప్రశ్నించింది.

ఇలాంటి విషయాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ‘రోసా’ నిబంధనలను ఉల్లంఘించినందుకు సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఏపీజీఈఏ సంఘం నేతలు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఏపీజీఈఏ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here