ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రెండో అధికారిక భాషగా ఉర్దూకి గుర్తింపు, నోటిఫికేషన్‌ జారీ

AP Govt Issues Orders For Recognising Urdu as The Second Official Language in State, government of Andhra Pradesh issued a notification recognising Urdu as the second official language in the state, recognising Urdu as the second official language in the state, Urdu as the second official language in the state, Urdu as the second official language, second official language, Urdu, government of Andhra Pradesh, Andhra Pradesh government issued a notification recognising Urdu as the second official language in the state, Andhra Pradesh government, AP second official language News, AP second official language Latest News, AP second official language Latest Updates, AP second official language Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రెండో అధికారిక భాషగా ఉర్దూను గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ-2022కు సంబంధించి మార్పులు చేశామని, దీనిని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఈ యేడాది మార్చిలో అసెంబ్లీ సమావేశాలలో దీనిపై ప్రత్యేక బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే. ఇది మైనారిటీలకు భద్రత మరియు సామాజిక హోదాను నిర్ధారించడానికి మరియు అన్ని రంగాలలో వారిని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిందని శాసనసభ అభిప్రాయపడింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =