ఏపీలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం

AP Second Phase Panchayat Elections: Nominations Started from Today

ఆంధప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియగా, రెండోదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. నేటినుంచి (ఫిబ్రవరి 2, మంగళవారం) రెండోదశకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల పాటుగా ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అభ్యర్థులు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ దశలో రాష్ట్రంలో గల 18 రెవిన్యూ డివిజన్లలో 174 మండలాల్లో 3335 సర్పంచ్, 33632 వార్డులకు ఫిబ్రవరి 13న ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు మొదటి దశలో సర్పంచ్‌ పదవులకు 19,491 నామినేషన్లు, వార్డు పదవులకు 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే మొదటిదశలో 93 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయినట్టు ప్రకటించారు. విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్-2

  • నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 2
  • నామినేషన్ చివరి రోజు: ఫిబ్రవరి 4
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 5
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 8
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 13
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 13
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =