భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Narendra Modi Unveils Virtually 30 Feet Alluri Sitarama Raju Statue at Bhimavaram AP, Narendra Modi Unveils Virtually 30 Feet Alluri Sitarama Raju Statue at Bhimavaram AP, Modi Unveils Virtually 30 Feet Alluri Sitarama Raju Statue at Bhimavaram AP, PM Modi Unveils Virtually 30 Feet Alluri Sitarama Raju Statue at Bhimavaram AP, 30 Feet Alluri Sitarama Raju Statue at Bhimavaram AP, Bhimavaram 30 Feet Alluri Sitarama Raju Statue, 30 Feet Alluri Sitarama Raju Statue, Alluri Sitarama Raju Statue, Prime Minister Narendra Modi virtually unveiled a 30-feet bronze statue of Tribal hero Alluri Sitaramaraju at Bhimavaram AP, 30-feet bronze statue of Tribal hero Alluri Sitaramaraju, Tribal hero Alluri Sitaramaraju, 30-feet bronze statue, Alluri Sitaramaraju, PM Modi Bhimavaram Tour News, PM Modi Bhimavaram Tour Latest News, PM Modi Bhimavaram Tour Latest Updates, PM Modi Bhimavaram Tour Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. దేశమంతా ‘అజాదీకా అమృత్‌ మహోత్సవాలు’ జరుగుతున్న వేళ ఇక్కడ ఆంధ్రాలో మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి యావత్‌ దేశానికే స్ఫూర్తి అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు వారసులతో వేదిక పంచుకోవడం అదృష్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా ప్రధాని ప్రసంగానికి ముందుగా మాట్లాడిన సీఎం జగన్.. దేశ స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారని, అలంటి మహనుభావులలో అల్లూరి సీతారామ రాజు ఒకరని అన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం అని, ఆయన మన తెలుగు గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారని, మన తెలుగు గడ్డపై కూడా అల్లూరి వంటి కొందరు వీరులు పోరాటాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఏపీ మంత్రి రోజా, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − twelve =