ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రుద్రరాజు రాజీనామా

Rudra Raju Resigns From The Post Of President Of APPCC,Rudra Raju Resigns From The Post,Post Of President Of APPCC,Rudra Raju Resigns,Donald trump, America, Republican party, America President Elections,Mango News,Mango News Telugu,Gidugu Rudra Raju,Andhra Pradesh Congress Chief,Andhra PCC president,Andhra Pradesh Congress Committee,Rudra Raju Latest News,President Of APPCC Latest News,President Of APPCC Live Updates
Ys Sharmila, Gidugu rudraraju, AP Congress, AICC, APPCC Chief

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అక్కడ కూడా గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈక్రమంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇస్తారని ముందు నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అలానే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఏపీపీసీసీ చీఫ్‌గావున్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం రుద్రరాజు వెల్లడించలేదు. అయితే ఏఐసీసీ ఆదేశాల మేరకే రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్.. రుద్రరాజు చేత రాజీనామా చేయించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇకపోతే గిడుగు రుద్రరాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2005-2007లో వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా రుద్రరాజు వ్యవహరించారు. ఆ తర్వాత 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా.. యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. 23 నవంబర్ 2022న కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ఏపీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తాజా ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇక రుద్రరాజు రాజీనామా చేయడంతో.. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fifteen =