మంచినీళ్లు అనుకోని శానిటైజర్‌ తాగిన బీఎంసీ అధికారి

BMC, BMC Joint Municipal commissioner, BMC Joint Municipal commissioner ramesh pawar, BMC Official, BMC official accidentally drinks hand sanitiser, BMC Official accidently drinks hand sanitiser, BMC Official Drinks Sanitizer, BMC Official Drinks Sanitizer Instead Of Water, BMC official mistakenly drinks hand sanitiser, Brihanmumbai Municipal Corporation, Education Budget Meeting, Mango News, ramesh pawar

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రదేశాల్లో మరియు అధికారిక సమావేశాల్లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ఊహించని ఘటన జరిగింది. మంచినీళ్లు అనుకోని ఓ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి పొరబాటుగా శానిటైజర్‌ తాగారు. ఈ రోజు మున్సిపల్‌ కార్పొరేషన్ విద్యా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంగా బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేష్ పవార్ మంచినీళ్ల బాటిల్ అనుకుని పొరపాటుగా టేబుల్ పై ఉన్న శానిటైజర్ బాటిల్ తీసుకుని తాగారు.

శానిటైజర్ తగినట్టు గ్రహించిన ఆయన వెంటనే దాన్ని ఉమ్మివేసాడు. తర్వాత సిబ్బంది ఆయనకు మంచి నీరు అందించారు. కాగా ఆయన ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేదు. కొంత విరామం అనంతరం సమావేశాన్ని కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. మంచి నీళ్ల బాటిల్స్ మరియు శానిటైజర్ బాటిల్స్ రెండూ ఒకేలా కనిపించడంతో ఈ ఘటన జరిగిందని, అనంతరం సమావేశం హాల్ లో శానిటైజర్ బాటిళ్లను తొలగించినట్టు బీఎంసీ సిబ్బంది వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =