ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుల ఎన్‌కౌంటర్‌

Punjab Two Gangsters Extinguished in an Encounter who Involves in Singer Sidhu Moosewala Assassination, Singer Sidhu Moosewala Assassination, Punjab Two Gangsters Extinguished in an Encounter, Punjab Two Gangsters Extinguished who Involves in Singer Sidhu Moosewala Assassination, Sidhu Moose Wala murder, Sidhu Moose Wala killing, Punjab encounter, Sidhu Moose Wala Murder Case, Shubhdeep Singh Sidhu, Two suspects in the case of Punjabi Singer Sidhu Moose Wala's murder were killed in an encounter, Punjabi Singer Sidhu Moose Wala, Sidhu Moose Wala, Sidhu Moosewala Assassination, Punjab Singer Sidhu Moosewala Assassination News, Punjab Singer Sidhu Moosewala Assassination Latest News, Punjab Singer Sidhu Moosewala Assassination Latest Updates, Punjab Singer Sidhu Moosewala Assassination Live Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను పంజాబ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూపా మరియు మన్‌ప్రీత్ సింగ్ మరణించారని పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ బాన్ ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు గాయపడగా, ఒక కెమెరామెన్‌కు బుల్లెట్ గాయమైందని, వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆయన వెల్లడించారు. కాగా సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఈ నిందుతులిద్దరూ పోలీసుల మోస్ట్ వాంటెడ్‌ లిస్టులో ఉన్నారు.

పంజాబ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసేవాలా పైన కాల్పులు జరిపిన నిందితులు మన్‌ప్రీత్ సింగ్ మరియు జగ్రూప్ సింగ్ రూపా, ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలోని చిచా భంకా గ్రామ సమీపంలో చంపబడ్డారు. అక్కడ వారు ఒక పొలంలో ఒంటరి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని చుట్టుముట్టారు. మూడు గంటలకు పైగా కొనసాగిన ఎన్‌కౌంటర్‌లో చివరకు వారిద్దరూ మరణించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్టల్‌, బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ కాల్చి చంపబడిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =