గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APPSC Group 1 Mains Exams, APPSC Group 1 Mains Exams Revised Schedule, APPSC Released Group 1 Mains Exams Revised Schedule, APPSC Released Group 1 Mains Exams Schedule, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల తేదీలను నవంబర్ 12, మంగళవారం నాడు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీ సీతారామాంజనేయులు పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును వివరించారు. ఫిబ్రవరి 4, 2020 నుంచి ఫిబ్రవరి 16, 2020 వరకు 7 పేపర్లతో గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా ఈ సంవత్సరం డిసెంబరు 12 నుంచి 23వ తేదీల మధ్య ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. అయితే ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి, మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉండడం, ఈ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి మరింత సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల వచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించడానికి ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గ్రూప్-1 పరీక్షలతో పాటుగా అటవీ రేంజ్ ఆఫీసర్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రధాన పరీక్షల తేదీలను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు:
తెలుగు పేపర్ —-> 04-02-2020
ఇంగ్లిష్ పేపర్ —-> 05-02-2020
పేపర్-1 —-> 07-02-2020
పేపర్-2 —-> 10-02-2020
పేపర్-3 —-> 12-02-2020
పేపర్-4 —-> 14-02-2020
పేపర్-5 —-> 16-02-2020
అటవీ రేంజ్ ఆఫీసర్ పరీక్షల తేదీలు —-> 17-03-2020, 18-03-2020, 19-03-2020
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ —-> 19-03-2020, 20-03-2020

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here