ఏపీలో ఆర్టీసీ బస్సు టిక్కెట్ల జారీకి ప్రథమ్‌ యాప్, జూలై 20 నుంచి ప్రారంభం

APSRTC, APSRTC app for inter-city services, APSRTC BUS Services, APSRTC Latest News, APSRTC Latest News Updates, APSRTC Official Website, APSRTC to launch Pratham app, APSRTC will Issue Bus Tickets Through Pratham App, Bus Tickets Through Pratham App, Pratham App for Ticket Booking

ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఆర్టీసీ బస్సుల టికెట్ల జారీ విధానాన్ని మరింత సులభతరం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త యాప్ ను తీసుకొస్తుంది. ప్రథమ్‌ అనే యాప్‌ను రూపొందించి, దీని ద్వారా నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. జూలై 20 వ తేదీ నుంచి ప్రథమ్‌ యాప్‌ ద్వారా ఆర్టీసీ బస్సులకు టికెట్లను జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ వెల్లడించారు. అయితే ప్రథమ్‌ యాప్ ను ప్రయోగాత్మకంగా ముందుగా 19 డిపోల పరిధిలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ విధానంలో భాగంగా బస్సు కండెక్టర్లు, డ్రైవర్లు నిర్దేశించిన ప్రమాణాల మేరకు స్మార్ట్‌ ఫోన్లు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందికి యాప్‌, సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అందిస్తామని ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =