జిల్లాల పర్యటన అద్భుతంగా సాగింది, ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు కనిపించింది : చంద్రబాబు

Badude Badudu Program Chandrababu Says Districts Tour was Successful People Seemed to Want Change, Chandrababu Says Districts Tour was Successful People Seemed to Want Change,, Chandrababu Says People Seemed to Want Change, Chandrababu Says Districts Tour was Successful, TDP Chief Chandrababu, Nara Chandrababu Naidu, TDP Chief Nara Chandrababu Naidu, Telugu Desam Party Chief, Telugu Desam Party President Nara Chandrababu Naidu, Chandrababu Naidu, Badude Badudu Program, Districts Tour was Successful Says Chandrababu, Chandrababu Naidu Districts Tour, Badude Badudu Program News, Badude Badudu Program Latest News, Badude Badudu Program Latest Updates, Badude Badudu Program Live Updates, Mango News, Mango News Telugu,

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరుసగా జిల్లాల పర్యటన చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన జిల్లాల పర్యటన అద్భుతంగా సాగిందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. చంద్రబాబు ట్వీట్ చేస్తూ, “మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ‘బాదుడే బాదుడు’ పై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి” అని అన్నారు.

“ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించింది. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయి. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్ధరాత్రి సైతం ఎదురొచ్చి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు!, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చింది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =