బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5: 19 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే…

Bigg Boss Season 5 Telugu Launch Episode Highlights, Bigg Boss 5 Telugu Live Updates, Bigg Boss Telugu 5, Bigg Boss Telugu 5 contestants, Bigg Boss Telugu 5 contestants list, Bigg Boss Telugu 5 Launch Highlights, Bigg Boss Telugu Season 5, Bigg Boss Telugu Season 5 Starts, Bigg Boss Telugu Season 5 Starts from Tomorrow, Full List Of Bigg Boss Telugu 5 Contestants, Host Nagarjuna, Mango News

గత నాలుగు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ రియాలిటీ షో విశేషంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ కూడా సెప్టెంబర్ 5, ఆదివారం నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి కూడా అగ్ర కథానాయకుడు, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. సీజన్ 5 ప్రారంభ ఎపిసోడ్లో నాగార్జున ఒక్కో సభ్యున్ని ఆహ్వానించి, బిగ్‌బాస్ ఇంటిలోకి పంపారు. మొత్తం 19 మంది సభ్యులు బిగ్‌బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు సోమ‌వారం నుండి శుక్రవారం వ‌ర‌కు రాత్రి 10 గంటలకు, శ‌ని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

ప్రారంభ ఎపిసోడ్ హైలైట్స్:

ముందుగా కింగ్ నాగార్జున స్టేజి పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్లి, అక్కడ అన్ని ప్రదేశాలను ఆడియన్స్ కు పరిచేయం చేశారు. గత నాలుగు సీజన్ల కంటే బిగ్‌బాస్ హౌస్ ని ఈసారి మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక వరుసగా 19 మంది సభ్యులను ఆహ్వానించి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపారు.

 • మొదటి కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ సిరి హనుమంత్‌ హౌస్ లోకి ఎంటర్ అయింది.
 • 2 వ కంటెస్టెంట్‌గా సీరియల్‌ నటుడు విజయ్‌ సన్నీ వచ్చారు.
 • 3 వ కంటెస్టెంట్‌గా నటి లహరి షెహరి హౌస్‌లోకి అడుగుపెట్టారు.
 • 4 వ కంటెస్టెంట్‌గా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-5 విజేత, సింగర్ శ్రీరామ చంద్ర ఎంట్రీ ఇచ్చారు.
 • 5 వ కంటెస్టెంట్‌గా డ్యాన్స్‌ మాస్టర్‌ అనీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
 • 6 వ కంటెస్టెంట్‌గా యాంకర్, నటుడు లోబో ఎంట్రీ.
 • 7 వ కంటెస్టెంట్‌గా నటి ప్రియ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
 • 8 వ కంటెస్టెంట్ గా మోడల్‌, ట్రైనర్‌ జెస్సీ ఎంట్రీ ఇచ్చారు.
 • 9 వ కంటెస్టెంట్‌గా ట్రాన్స్‌ జెండర్‌, నటి ప్రియాంక సింగ్‌ అడుగుపెట్టారు.
 • 10 వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ షణ్ముఖ్‌ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
 • 11 వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ హమీదా ఎంట్రీ ఇచ్చారు.
 • 12 వ కంటెస్టెంట్‌గా డాన్స్ మాస్టర్ఎం నటరాజ్ ఎంట్రీ ఇచ్చాడు.
 • 13 వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ సెవెన్‌ ఆర్ట్స్‌ సరయు బిగ్‌బాస్ ‌లోకి అడుగుపెట్టారు.
 • 14 వ కంటెస్టెంట్‌గా నటుడు, బాడీ బిల్డర్‌ విశ్వ ఎంట్రీ.
 • 15వ కంటెస్టెంట్‌గా నటి ఉమాదేవి వచ్చారు.
 • 16 వ కంటెస్టెంట్‌గా నటుడు మానస్‌ ఎంట్రీ ఇచ్చారు.
 • 17 వ కంటెస్టెంట్ గా ఆర్జే కాజల్‌ ఎంట్రీ ఇచ్చారు.
 • 18 వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ శ్వేత వర్మ హౌస్ లోకి అడుగుపెట్టారు.
 • 19 వ కంటెస్టెంట్‌గా యాంకర్‌, నటుడు రవి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
 • కొన్ని వారాల పాటుగా ప్రేక్షకులను అలరించబోయే ఈ రియాలిటీ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =