అమరావతిపై హైకోర్ట్ తీర్పును బీజేపీ స్వాగతిస్తోంది – కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి

BJP Welcomes High Court Verdict on Amravati Says Former Union Minister Purandeshwari, BJP Welcomes High Court Verdict, BJP Welcomes High Court Verdict On Capital Amravati, BJP Welcomes High Court Verdict on Amravati, BJP, Amravati, High Court Verdict on Amravati Says Former Union Minister Purandeshwari, Former Union Minister Purandeshwari, High Court Verdict on Amravati, Union Minister Purandeshwari, High Court Verdict on Three Capitals, Verdict on Three Capitals, Three Capitals, AP High Court, High Court, CRDA, Amaravati Metropolitan Region Development Authority, Capital Region Development Authority, Capital Region Development Authority Cancellation Petitions, High Court Verdict on Three Capitals And CRDA Cancellation Petitions, Petitions, Mango News, Mango News Telugu,

అమరావతి రాజధానిపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. కాగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఉదయం కీలక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతికే బిజెపి కట్టుబడి ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు కేంద్రం చేసిన నిధుల కేటాయింపులు అన్నీ అమరావతి రాజధానిగానే జరిగాయని ఆమె తెలిపారు.

ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ అమరావతి అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు కోర్ట్ ఆదేశాలతోనైనా తన వైఖరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆమె అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించటం ఇష్టం లేని ప్రభుత్వానికి ఇక్కడి భూములు మాత్రం కావాల్సి వచ్చాయని విమర్శించారు. హైకోర్టు తీర్పు మేరకు ఇప్పటికైనా రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూములను అందివ్వాలని సూచించారు. సీఆర్డీఏ చట్టాన్ని అనుసరించి రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − one =