ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం

Central Government Gives Clarity on Special Status For Andhra Pradesh, Special Status For Andhra Pradesh, Andhra Pradesh, Special Status For AP, Special Status For AP Latest News, Special Status For AP Latest Updates, Special Status For AP Live Updates, Special Status, AP Special Status, Central Government Gives Clarity on AP Special Status, Central Government Gives Clarity on Andhra Pradesh Special Status, Andhra Pradesh Special Status, Andhra Pradesh, AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని హామీలలో చాలా వరకు హామీలను నెరవేర్చామని కేంద్రమంత్రి వెల్లడించారు. అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 32% నుంచి 42 శాతానికి పెంచామని గుర్తుచేశారు.

తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో చర్చ సందర్భంగా పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదాపై కొందరు నాయకులు పట్టుబట్టగా.. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనికి ఒప్పుకున్నారు. కానీ, విభజన అనంతరం ఇప్పటివరకు ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షే అయింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మొదటినుంచి చెబుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే దీనిపై ఏపీలోని రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 8 =