ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.. సూచించిన వాతావరణ శాఖ

IMD Predicts Heavy Rains and Hailstorms in AP and Telangana For Next Three-Four Days,IMD Predicts Heavy Rains and Hailstorms,Rains and Hailstorms in AP and Telangana,AP and Telangana Rains For Next Three-Four Days,Mango News,Mango News Telugu,AP and Telangana Weather Update,IMD predicts rainfall with hailstorms,Unseasonal rains to hit few districts in Andhra Pradesh,Hyderabad wakes up to intense morning thunderstorm,Heavy Rains With Storms In Telangana,AP and Telangana Heavy Rains Latest News,AP and Telangana Heavy Rains Latest Updates

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మరో మూడు, నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఇంటీరియల్‌ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో రేపు కోనసీమ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని, అలాగే మరికొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

మరోవైపు తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండగా.. రానున్న తదుపరి మూడు రోజుల్లో పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సందర్భంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ దురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సోమవారం, మంగళవారాల్లో ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 11 =