కొనసాగుతున్న ‘కర్ణాటకం’

Karnataka Political Crisis Developments,Mango News,Karnataka Latest News,Karnataka Political News,Karnataka Crisis Live,Karnataka Political Crisis Latest Developments,Karnataka political crisis deepens deputy CM offers to resign,Karnataka political crisis LIVE updates
  • రాజీనామాలను ఆమోదించని కర్ణాటక స్పీకర్
  • మకాం గోవాకి మార్చిన అసమ్మతి నేతలు
  • పరిణామాలపై బిజెపి నేతల చర్చలు

కర్ణాటక రాజకీయాల్లో మొదలైన మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి, అసమ్మతి నేతలు ఒకటే పంధాలో, ఎలాంటి హామీలకు లొంగకుండా ఉన్నారు. రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, సీనియర్ నాయకులు వరుసగా భేటీ అవుతున్న కూడ వారి నుండి స్పష్టమైన ఫలితాలు రావడం లేదు. అంతే కాకుండా రాజీనామా చేసి ముంబై లో మకాం వేసిన 14 మంది అసంతృప్తి నేతలు, ఇప్పుడు వారి స్థావరాన్ని నేడు గోవా కి మార్చనున్నారు. గోవాకి చెందిన ఒక అధికారపార్టీ నేత వారికీ అక్కడ ఒక రిసార్ట్ లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్- జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం లో మరో ఇద్దరు స్వతంత్రులు కూడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు, దీంతో అసంతృప్తి నేతల సంఖ్య 16 కి చేరుకుంది. మరో వైపు ఈ రోజు కర్ణాటక స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలనుకున్నారు కానీ, పోస్టులో పంపిన రాజీనామాలను ఆమోదించకూడని నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలపై స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తరువాత, ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయే అనే దానిపైనే అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటక బిజెపి నేతలు వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలపై చర్చించడానికి భేటీ అయ్యారు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటికి చేరుకొని, ప్రభుత్వం బలం కోల్పోతే, అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here