వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష, ఆరోగ్యశ్రీలో కొత్తగా మరో 809 చికిత్సలను చేర్చాలని ఆదేశం

CM Jagan Held Review Meet on Medical and Health Department Directs Officials To Add 809 New Procedures in Aarogyasri, CM Jagan Held Review Meet on Medical and Health Department, Directs Officials To Add 809 New Procedures in Aarogyasri,CM Jagan Review on Medical And Health Department, CM Jagan 809 New Treatments In Arogya Sri, 809 New Treatments In Arogya Sri, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy,Arogya Sri,CM Jagan Arogya Sri, AP CM YS Jagan Latest News And Updates,AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 809 చికిత్సలను చేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.

వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • హెల్త్‌ హబ్‌లు, ఆసుపత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి.
  • విలేజ్ క్లినిక్స్ మరియు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కవర్ చేయబడుతున్న సేవలను తెలిపే బోర్డులు ఉంచాలి.
  • ఇతర రాష్ట్రాలకు చెందినవారు మన రాష్ట్ర పరిధిలో ప్రమాదవశాత్తూ గాయపడితే వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలి.
  • ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది.
  • అర్హులైనవారికి సేవా మిత్ర, సేవా రత్న వంటి ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వబడతాయి.
  • వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి 1059 వైద్య సేవలు ఉండగా, 2020 జనవరిలో మరో 1,000 కొత్త వాటిని చేర్చామని తెలిపారు.
  • వేయి రూపాయల పైబడి ఖర్చు అయ్యే అన్ని చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు చేర్చమని వెల్లడించారు.
  • అనంతరం మరికొన్నిటిని పెంచుకుంటూ గతేడాది జూన్ నాటికీ 2,446కి పెంచామని, ఇప్పుడు తాజాగా పెంచినవాటితో కలిపి మొత్తం 3,255 చికిత్సలు అయ్యాయని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =