దేశంలో కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేష్ దేవుళ్ల ఫోటోలు ఉంచండి, ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ

Delhi CM Arvind Kejriwal Writes to PM Modi Request to Put Pictures of Lakshmi and Ganesh on Currency Notes, Arvind Kejriwal, Narendra Modi, Delhi CM Arvind Kejriwal, Indian PM Narendra Modi, Mango News, Mango News Telugu, Arvind Kejriwal Slams Modi, Kejriwal Asks PM Modi To Include Ganesh And Lakshmi Images, New Indian Currency, Modi on New Indian Currency, Arvind Kejriwal On New Indian Currency, Ganesh And Lakshmi Images On New Indian Currency, News Indian Currency Latest News And Updates

దేశంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోలతో పాటు హిందూ దేవతలైన లక్ష్మీ మరియు గణేష్ ఫోటోలను చేర్చాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం లేఖ రాశారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ, గణేష్ దేవుళ్ళ ఫోటోలను కూడా ఉంచాలని 130 కోట్ల మంది భారతీయుల తరపున అభ్యర్థిస్తూ ప్రధానికి లేఖ రాశానని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను తన ట్విట్టర్ అక్కౌంట్ లో కేజ్రీవాల్ షేర్ చేశారు.

“దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు భారతీయ కరెన్సీపై ఒకవైపు గాంధీజీ, మరోవైపు శ్రీ గణేష్ జీ, లక్ష్మీజీల చిత్రం ఉండాలని కోరుకుంటున్నారు. నేడు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన దశను దాటుతోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాలలో ఒకటిగా భారతదేశం పరిగణించబడుతుంది. నేటికీ మన దేశంలో ఎంతో మంది పేదలున్నారు. ఎందుకు?, ఒకవైపు దేశవాసులందరూ కష్టపడి పనిచేయాలి, మరోవైపు మన ప్రయత్నాలు ఫలవంతం కావాలంటే భగవంతుని ఆశీస్సులు కూడా కావాలి. సరైన విధానం, కృషి మరియు భగవంతుని ఆశీస్సులు, వాటి సంగమం ద్వారా మాత్రమే దేశం పురోగమిస్తుంది. నేను నిన్న మీడియా సమావేశంలో బహిరంగంగానే డిమాండ్ చేశాను. అప్పటి నుంచి ఈ అంశంపై సామాన్య ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ప్రజలు దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని వెంటనే అమలు చేయాలని అందరూ కోరుతున్నారు” అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =