రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

AP CM YS Jagan, AP CM YS Jagan Policies On Irrigation Projects, AP Irrigation Department, AP Irrigation Projects, AP Irrigation Projects Progress, AP Pending Irrigation Projects, CM YS Jagan, CM YS Jagan Held Review on Progress of Irrigation Projects, CM YS Jagan Held Review on Progress of Irrigation Projects in the State, CM YS Jagan Urges Officials To Finish Irrigation Projects, Irrigation Projects, Mango News, Progress of Irrigation Projects

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు రాష్ట్రంలో పోలవరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నిధుల సమస్య లేకుండా చూస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఈ 18 నెలల్లోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌–1, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్–2, టన్నెల్–2 సహా వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిన పనులు, వంశధార నాగావళి లింక్, వంశధార ఫేజ్–2, స్టేజ్‌–2 లను ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా నిర్దేశించుకుందని చెప్పారు. ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న సమయంలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =