తెలంగాణలో కీలక పరిణామం, టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

Mango News, Merge TDLP into TRS, Speaker clears TDLP merger with TRS, TDLP, TDLP Merged in TRSLP, TDLP Merged in TRSLP News, TDLP merges with TRSLP, telangana, Telugu Desam Legislative Party, Telugu Desam Legislative Party merges with TRSLP, TRSLP, TRSLP TDLP Merged, Two TDP MLAs Handover Letter to Telangana Speaker

తెలంగాణలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షం (టీఆర్‌ఎస్‌ఎల్పీ)లో తెలుగుదేశం శాసనసభ పక్షం (టీడీఎల్పీ) విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ, విలీనానికి సంబంధించిన లేఖను ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్‌రావు బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి అందించారు. ముందుగా 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్‌ రావు టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

అనంతరం కొన్నాళ్ల తరువాత సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తాజాగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌ రావు సైతం టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే టీడీఎల్పీ విలీనంపై వారివురూ స్పీకర్ కు లేఖ అందించారు. దీంతో ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =