ఓటమి భయంతో అభ్యర్ధులను మార్చేస్తున్న జగన్

Paderu voters, Paderu constituency,Jagan, changing candidates,Chandra Babu, TDP, Janasena, YCP,assembly elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Paderu voters, Paderu constituency,Jagan, changing candidates,Chandra Babu, TDP, Janasena, YCP,Jagan

పాడేరు నియోజక వర్గాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గంగా చెబుతారు. జగన్ ప్రభుత్వ హయాంలో జిల్లాలు విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గం చేరింది. ఈ నియోజకవర్గంలో పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, జికే వీధి, కొయ్యూరు అనే ఐదు మండలాలు ఉన్నాయి.ఇప్పటి వరకు పాడేరులో  16 సార్లు ఎన్నికలు జరిగాయి.

1985లో తొలిసారి ఇక్కడ తెలుగు దేశం పార్టీ విజయాన్ని దక్కించుకుంది. 1989  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ఎం.బాలరాజు గెలిచారు. 1994 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన కె. చిట్టి నాయుడుకి పాడురు ఓటర్లు విజయాన్ని అందించారు. ఇక, 1999లో ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన మత్య్సరాస మణికుమారిని పాడేరు ఓటర్లు గెలిపించారు.

2004 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఎల్. రాజారావుకి విజయాన్ని  సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పసుపులేటి బాలరాజు గెలిచారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గెలిచారు. దీనిని బట్టి పాడేరులో ఇప్పటివరకూ  హ్యాట్రిక్ సాధించలేదు.. అంటే ఒక్కో పార్టీ  కేవలం రెండు సార్లు మాత్రమే వరుసగా ఒక పార్టీ విజయాన్ని దక్కించుకున్న రికార్డు ఉంది.

1994, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ.. 2014, 2019లో జరిగిన ఎన్నికలలో వైసీపీ గెలుపు గుర్రాలు ఎక్కాయి. ఇక, మిగిలిన అన్ని ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ప్రజలు పార్టీలను మార్చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇదే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక, రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి.. మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ మాత్రం సర్వేల పేరుతో  అభ్యర్థిని మారుస్తూ వస్తోంది. ఇప్పటికి రెండుసార్లు ఇన్చార్జ్‌లను మార్చిన జగన్.. తాజాగా మత్స్యరాస విశ్వేశ్వరరాజును ఇన్చార్జ్‌గా నియమించింది.

పాడేరు ప్రజల మూడ్ ఎలా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులకు సైతం ఎప్పుడూ అంచనా వేయలేరు. ఎస్టీ నియోజకవర్గం అయిన పాడేరులో గిరిజనులంతా ఒకే మాట అనుకుంటారు. ఎన్నికలకు ముందు గూడేలు, తండాల్లో   రహస్యంగా సభలు పెట్టుకుని… దీనిలో పెద్దలు చేసిన తీర్మానంతో వారు ఓటు వేస్తారు.

అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని.. కీలకమైన రహదారి నిర్మాణం లేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడి రోగులు వైద్యశాలలకు వెళ్లడానికి ఇప్పటికీ డోలీలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని తాము నమ్మేది లేదని భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =