కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Coronavirus Common Symptoms,Coronavirus Causes,Coronavirus Required Precautions,Coronavirus Cases, Coronavirus Latest updates,coronavirus common virus,Coronaviruses Symptoms,Coronavirus Treatments,Coronavirus Update,Coronavirus Latest News,Covid, Covid-19, Corona Virus In India, Corona Virus Effect In Telangana

చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ పలు ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 130కి చేరుకుంది. మరో 5000 మందికి పైగా ఈ వైరస్‌ వలన అనారోగ్యం పాలవగా, వారిలో 1000 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. భారత్‌ పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్‌లో అధికారికంగా ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ దేశంలో వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్ పై సమాచారం కోసం 24X7 హెల్ప్‌లైన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ వైరస్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు, అనుమానాలున్నా 011-23978046 నెంబరుకు ఫోన్‌ చేసి ప్రజలు నివృత్తి చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు. అలాగే అన్ని విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి, అనుమానుతుల్ని ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఢిల్లీ,ముంబయి, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోని కీలక ఆసుపతుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులేవీ నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌ ప్రకటించారు.

కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు:

  • దగ్గు, ముక్కు కారుతూనే ఉండడం
  • జ్వరం, తలనొప్పి
  • న్యుమోనియా, శ్వాస ఆడకపోవడం
  • వాంతులు, డయేరియా
  • వ్యాధి తీవ్రత పెరిగితే తీవ్రమైన న్యుమోనియా, రెనాల్ (కిడ్నీ ఫెయిల్యూర్) తో మనిషి మరణించే అవకాశం

కరోనా వైరస్‌ వ్యాపించే విధానం:

  • సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది
  • వ్యాధి సోకినా వ్యక్తి తుమ్మినా, దగ్గినా తుంపరల వలన పక్క వారికి సోకే అవకాశం
  • వ్యాధి సోకినా వారిని స్పర్శించిన, షేక్ హ్యాండ్ తీసుకున్నా ఇతరులకు వచ్చే ప్రమాదం
  • వ్యాధి సోకినా వ్యక్తి ముట్టుకున్నా వస్తువులను ముట్టుకున్నా, చేతులు శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వైరస్ సోకుతుంది

కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి
  • జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండాలి, ఒకవేళ వెళ్లినా మాస్క్‌ ధరించాలి
  • చుట్టుపక్కల పరిశుభ్రతతో పాటుగా వ్యక్తిగత శుభ్రతను పెంపొందించుకోవాలి
  • పెంపుడు జంతువులకు దూరంగా ఉండడమే మంచిది
  • జలుబు, దగ్గు, జ్వరంతో మొదలై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన, చాతిలో నొప్పి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి
  • ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 8 =